ఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2025 డిసెంబర్లో ఈ టోర్నీని భారత్‌లో నిర్వహించనున్నట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
24 జట్లు తలపడబోయే ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు అందజేసినందుకు భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఎఫ్‌ఐహెచ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ చివరి సారిగా 2021 (భువనేశ్వర్)లో ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది.