Womens World Cup : మహిళల ప్రపంచ కప్ పోటీలకు నేటితో తెరలేవనుంది. ఆసియా కప్ ముగియడంతో అభిమానులను అలరించేందు మహిళల క్రికెట్ పండుగ గువాహటి వేదికగా ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్ (India), శ్రీలంక (Srilanka)లు తొలి పోరులోనే తలపడుతున్నాయి. దాంతో.. ఫలితంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే.. గత రికార్డులు మాత్రం టీమిండియా ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ, చమరి ఆటపట్టు నేతృత్వంలోని లంకను తక్కువ అంచనా వేయడానికి లేదు.
వన్డేల్లో ఇప్పటివరకూ భారత్, శ్రీలంక 35సార్లు తలపడ్డాయి. భారత్ 31 విజయాలతో స్పష్టమైన ఆధిపత్యం చెలాయించగా.. లంక మూడు విజయాలకే పరిమితమైంది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కానీ, వరల్డ్ కప్‌లో లంకను లైట్ తీసుకుంటే టీమిండియాకు షాక్ తగిలే అవకాశముంది. ఎందుకంటే.. ఒకప్పుడు శ్రీలంక జట్టు వేరు. ఇప్పుడు చమరి ఆటపట్టు (Chamari Athapaththu) సారథ్యంలోని జట్టు వేరు. ఆమె పగ్గాలు అందుకున్నాక లంక టీమ్ ఆటే మారిపోయింది. దూకుడుగా ఆడి శుభారంభాలు ఇచ్చే ఆటపట్టు.. బంతితోనూ మ్యాజిక్ చేయగలదు. జట్టులో విజయకాంక్షను రగల్చడంలో ఆమెకు ఆమే సాటి.
Cricket Prediction | IND-W vs SL-W | ICC Women’s World Cup 2025 | 1st Match | Sept 30 – Who Will Set the Tone in the Opener?https://t.co/QwVhWzu0uJ#JeetBuzz #JB #INDWvsSLW #WomensWorldCup2025 #CricketPrediction #WWC2025 #CricketOpener #INDW #SLW #WomensCricket #CricketFans pic.twitter.com/aVx5JRBPuy
— JeetBuzz.News (@JeetbuzzNews) September 29, 2025
నిరుడు ఆసియా కప్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి షాకిచ్చింది శ్రీలంక. సూపర్ విక్టరీతో తొలి ఆసియా టైటిల్ సాధించిన ఆటపట్టు సేన ఇప్పుడు వరల్డ్ కప్ బరిలో నిలిచింది. స్వదేశంలో జరుగనున్న ఈ టోర్నీలో పెద్ద జట్లకు షాకిచ్చి తొలిసారి ట్రోఫీని అందుకోవాలని ఆశతో ఉంది లంక. ఈసారి ఆసియా జట్టే కప్ గెలవాలని కోరుకుంటున్నానని ఆటపట్టు వెల్లడించింది.
For the first time, Sri Lanka Women won the Asia Cup🇱🇰🏆
WINNING MOMENT – HISTORY 🏏#WomensAsiaCup #WomensAsiaCup #INDvSL #LKA #SriLanka pic.twitter.com/WYmCsmGbQg— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) July 28, 2024
‘కో- హోస్ట్‌గా వన్డే వరల్డ్ కప్ పోటీలకు శ్రీలంక ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. ఉపఖండంలో వరల్డ్ కప్ ఆడడం మాకు కలిసిరానుంది. ఎందుకంటే.. భారత్‌లోనూ శ్రీలంక పరిస్థితులే ఉంటాయి. అయితే.. అతిగా ఆలోచిస్తే మెరుగైన ప్రదర్శన చేయలేం. సెమీ ఫైనల్ చేరినా చాలు మాకది గొప్ప విజయమే. వచ్చే సీజన్లో మరింత మెరుగ్గా ఆడుతాం’ అని ఆటపట్టు తెలిపింది. శ్రీలంక బ్యాటింగ్‌కు బలమైన ఆయుధమైన ఆమె వన్డేల్లో 9 సెంచరీలు సాధించింది.
It all starts tomorrow! 🙌
Drop in your wishes for the #WomenInBlue 💙✍️
Grab your #CWC25 Tickets now: https://t.co/vGzkkgwpDw #TeamIndia pic.twitter.com/aYmBLtNFrI
— BCCI Women (@BCCIWomen) September 29, 2025
భారత్ విషయానికొస్తే.. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్, మిడిలార్డర్లో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ కీలకం. వీళ్లకు హర్లీన్ డియోల్, రాధా యాదవ్ కూడా తోడైతే బ్యాటింగ్ కష్టాలు తీరినట్టే. బౌలింగ్ యూనిట్లో రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, స్నేహ్ రానా, రాధికా కీలకం కానున్నారు.