IND vs WI | నేడే భారత్, విండీస్ ఫస్ట్ వన్డే.. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు జరిగే కీలక సిరీస్‌లో గెలుపెవరిదో!
IND vs WI | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్ కీలక సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశం వేదికగా మెగాటోర్నీ సమీపిస్తున్న వేళ అందుబాటులో ఉన్న మ్యాచ్‌ల ద్వారా జట్టుపై ఓ అంచనాకు వచ్చేందుకు టీమ్ఇండియా ప్రణాళికలు రచిస్తున్నది.
IND vs WI | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్ కీలక సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశం వేదికగా మెగాటోర్నీ సమీపిస్తున్న వేళ అందుబాటులో ఉన్న మ్యాచ్‌ల ద్వారా జట్టుపై ఓ అంచనాకు వచ్చేందుకు టీమ్ఇండియా ప్రణాళికలు రచిస్తున్నది. టెస్టు సిరీస్ గెలుపు జోరును వన్డేల్లోనూ కొనసాగిస్తూ వెస్టిండీస్‌పై పైచేయి సాధించాలని చూస్తున్నది. తొలిసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత దక్కించుకోలేకపోయిన కరీబియన్లు పోరాడేందుకు సమాయత్తమవుతున్నారు. సొంత ఇలాఖాలో తమ సత్తా చూపేందుకు తహతహలాడుతున్నారు.
బ్రిడ్జ్‌టౌన్(బార్బడోస్): భారత్, వెస్టిండీస్ జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాయి. గురువారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. వన్డే ప్రప్రంచకప్ టోర్నీకి సమయం దగ్గర పడుతున్న వేళ టీమ్ఇండియా ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా భావిస్తున్నది. విండీస్‌తో సిరీస్ ద్వారా రానున్న ఆసియా కప్, వరల్డ్‌కప్ టోర్నీకి ఎలాంటి ప్రణాళికలు ఎంచుకోవాలో చూస్తున్నది. ముఖ్యంగా జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. టీ20ల్లో ఇరుగదీస్తున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. ఆస్ట్రేలియాతో గత మూడు వన్డేల్లో హ్యాట్రిక్ డాకౌట్లు కావడం సూర్య వన్డే ప్రదర్శనపై ప్రభావం చూపిస్తున్నది.

పొట్టి ఫార్మాట్లో పూనకం వచ్చినట్లు రెచ్చిపోయే సూర్య..వన్డేల్లో అదే ఊపు ప్రదర్శించలేకపోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో తన సత్తాఏంటో చూపేందుకు సూర్యకు ఇది మంచి అవకాశం. మరోవైపు వికెట్‌కీపర్, బ్యాటర్ కోసం శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. విండీస్‌తో టెస్టుల్లో ఆకట్టుకున్న కిషన్ వైపు మొగ్గుచూపుతుందా లేక సీనియర్ శాంసన్‌కు అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విషయానికొస్తే..మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపించనుండగా, జైదేవ్ ఉనద్కట్, ముకేశ్‌కుమార్, ఉమ్రాన్ మాలిక్లో ఇద్దరు తుదిజట్టులో ఉండనున్నారు. స్పిన్నర్లలో చాహల్ కంటే కుల్దీప్యాదవ్పై మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయనున్నారు.
సత్తాచాటలని విండీస్ : వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేపోయిన విండీస్..సొంతగడ్డపై సత్తాచాటాలని చూస్తున్నది. షిమ్రాన్ హిట్మైర్, ఓషానె థామస్ తిరిగి జట్టులోకి రావడం ఆ జట్టుకు లాభించే అవకాశముంది. వీరికి తోడు షాయి హోప్, రోవ్‌మన్ పావెల్ రాణిస్తే..విండీస్ గట్టేక్కినట్లే.
జట్ల అంచనా
భారత్: రోహిత్‌శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, శాంసన్/కిషన్, జడేజా, అక్షర్‌పటేల్/శార్దుల్, కుల్దీప్యాదవ్, సిరాజ్, ఉమ్రాన్/జైదేవ్/ముకేశ్ కుమార్
వెస్టిండీస్: షాయి హోప్(కెప్టెన్), కింగ్, మేయర్స్, కార్టీ, హెట్‌మైర్, పావెల్, షెఫర్డ్, సింక్లేయిర్, జోసెఫ్, మోతీ/క్యారె/థాస్, జైడేన్ సీల్స్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

