ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. మెగాటోర్నీలో టీమ్ఇండియాతో తాము మ్యాచ్ ఆడేది లేదంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆయన మాట్లాడుతూ బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈనెల 15న కొలంబోలో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడబోమని షరీఫ్ కుండబద్దలు కొట్టారు. ‘టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడకపోవడంపై మేము పూర్తి స్పష్టతతో ఉన్నాం. క్రీడల్లో రాజకీయాలను తీసుకురావద్దు. ఈ విషయంలో బంగ్లాకు మద్దతుగా నిలుస్తాం. ఇది సరైన నిర్ణయంగా మేము భావిస్తున్నాం’అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ విషయమై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి ఐసీసీకి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.