జొహొర్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జొహొర్ (మలేషియా) వేదికగా జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్లో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్ తరఫున అరిజీత్ సింగ్ (43 వ నిమిషంలో), సౌరభ్ (47), మన్మీత్ సింగ్ (53) తలా ఓ గోల్ చేశారు.
పాక్ నుంచి ఐదో నిమిషంలోనే హన్నన్ షాహిద్ 5వ నిమిషంలోనే గోల్ చేయగా సుఫియా ఖాన్ (39, 55) రెండు గోల్స్ కొట్టాడు. అయితే ఇరు దేశాల ప్లేయర్లు హైఫై ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.