ఇఫో(మలేషియా): సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీకి ఆదివారం తెరలేవనుంది. ఈనెల 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఐదు సార్లు చాంపియన్ భారత్ టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్నది. 2019 తర్వాత తొలిసారి టోర్నీలో ఆడుతున్న టీమ్ఇండియా తమ మొదటి మ్యాచ్‌లో కొరియాతో తలపడనుంది.
ఈసారి ఎడిషన్‌లో భారత్ సహా బెల్జియం, కెనడా, కొరియా, న్యూజిలాండ్, ఆతిథ్య మలేషియా రౌండ్ రాబిన్ పద్ధతిలో ఆడుతాయి. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.