IND vs NZ : అహ్మదాబాద్ వేదిక జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కే మొగ్దు చూపాడు. సిరీస్ డిసైడర్ ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. పేసర్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్ తరఫున ఈ మ్యాచ్‌లో ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ బెన్ లిస్టెర్ ఆరంగ్రేటం చేయనున్నాడు. భారత్, కివీస్ తుది జట్టులోని అటగాళ్లు ఎవరంటే..
భారత జట్టు : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ జట్టు : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ ఛాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంటర్న్ (కెప్టెన్), ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, బ్లెయిర్ టిక్నర్.