ముంబై: ఆల్‌ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదుగుతున్న తెలుగు యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. చెన్నైలో రెండో టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడ్డ నితీశ్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.
పక్కటెముకల గాయంతో బాధపడుతున్న నితీశ్ గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని సెంటర్ ఎక్సలెన్సీలో పునరావాసం పొందనున్నాడు. గాయపడ్డ నితీశ్ స్థానంలో ముంబై ఆల్‌రౌండర్ శివమ్దూబేకు సెలెక్టర్లు చా న్స్ ఇచ్చారు. మ రోవైపు ప్రాక్టీస్ సందర్భంగా వెన్నునొప్పి బారిన పడ్డ రిం కూసింగ్..రెండు, మూడు టీ20లకు అందుబాటులో లేకుండా పోయాడు. రింకూ స్థానంలో రమణ్దీప్సింగ్ను రిజర్వ్‌గా ఎంపిక చేశారు.