భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తక్కువ స్కోరుతోనే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. టీమిండియాను శార్దూల్ ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 31 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
శార్దూల్ తర్వాత టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేసి.. ఔట్ అయ్యాడు. శార్దూల్.. 36 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాదాడు. కోహ్లీ.. 96 బంతుల్లో 8 ఫోర్లు కొట్టాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు తీయగా.. రాబిన్ సన్.. మూడు వికెట్లు తీశాడు. అండర్సన్ ఒకటి, ఓవర్టన్ ఒక వికెట్ తీశారు.
మిగితా ప్లేయర్లు.. రోహిత్ శర్మ 11 పరుగులు, కేఎల్ రాహుల్ 17 పరుగులు, జడెజా 10, రహనే 14, పంత్ 9, ఉమేశ్ 10 పరుగులు చేశారు.
Innings Break#TeamIndia have been bowled out for 191 (Virat 50, Shardul 57) in 61.3 overs after being asked to bat first in the fourth Test. Stay tuned as our bowlers will be in action soon.
— BCCI (@BCCI) September 2, 2021
Scorecard – https://t.co/OOZebPnBZU #ENGvIND pic.twitter.com/kwq6QmaBXt