 
                                                            మెల్బోర్న్: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా శుక్రవారం రెండో మ్యాచ్ ఆడనున్నాయి. రెండ్రోజుల క్రితం కాన్బెర్రాలో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దవగా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరుజట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి.
అయితే మెల్‌బోర్న్‌లోనూ వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కల్గించే అవకాశాలు ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో ఈ పోరు అయినా పూర్తిగా సాగుతుందా? లేదా? అన్నది చూడాలి. మధ్యాహ్నం 1:45 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో వీక్షించొచ్చు.
 
                            