Kohli-Rahul | వరల్డ్ కప్ టోర్నీలో నాలుగో వికెట్‌కు కోహ్లీ-రాహుల్ నాలుగో రికార్డు భాగస్వామ్యం
Kohli-Rahul | ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ విజయంలో కీలక భాగస్వామ్యం వహించిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 165 పరుగులు జత చేశారు. ఇప్పటి వరకూ జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లలో టీం ఇండియాలో వీరి భాగస్వామ్యం నాలుగో అతి పెద్ద భాగస్వామ్యం.
Kohli-Rahul | ఐసీసీ వరల్డ్ కప్-2023లో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియా బోణీ చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కలిసి నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 165 పరుగులు చేశారు. ఇది వరల్డ్ కప్ టోర్నమెంట్లలో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి అత్యధిక స్కోర్. వరల్డ్ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ ల్లో ఇది రెండో భాగస్వామ్యం.
ఇంతకుముందు 1996లో టీం ఇండియా విజయంలో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి నవజ్యోతి సిద్ధూ, వినోద్ కాంబ్లీ కలిసి 142 పరుగులు చేశారు.1998లో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్ లో అజయ్ జడేజా, మహ్మద్ అజారుద్దీన్ కలిసి నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 275 పరుగులు జత చేశారు.
ఆదివారం వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీం ఇండియాను ఆదుకునేందుకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. కోహ్లీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 72 బంతులు, కేఎల్ రాహుల్ 75 బంతులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కోహ్లీ తన వ్యక్తిగత స్కోర్ 85 పరుగుల వద్ద షార్ట్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్ అందించడంతో ఔటయ్యాడు. అప్పటికి నాలుగో వికెట్ భాగస్వామ్యానికి వారిద్దరూ. 165 పరుగులు జత చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

