అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) జరుగుతున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా (India) ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC final) పోరుకు అర్హత సాధించాలని చూస్తున్నది. అయితే మూడో టెస్టు విజయం ద్వారా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న కంగారూలు అదే ఊపు కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. స్టేడియంలో ఇరు దేశాల ప్రధానమంత్రులు సందడి చేశారు. నాలుగోటెస్టు తొలిరోజు ఆట చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి హాజరయ్యారు.
టీమ్ఇండియా తుదిజట్టు.. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యారు, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఖవాజ, లబుషేన్, హ్యాండ్స్కోంబ్, గ్రీన్, అలెక్స్ క్యారీ, స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, కునెమన్