లక్నో: తొలి వన్డేలో అఫ్గానిస్థాన్‌పై భారీ విజయం అందుకున్న భారత్ ఇప్పుడు సిరీస్‌పై గురి పెట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం జరిగే రెండో పోరులోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న గిల్‌సేన పలు ప్రయోగాలు కూడా చేయనుంది. వన్డే ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని టీమ్ కూర్పుపై దృష్టి సారించింది. మొదటి వన్డేలో అవకాశం దక్కించుకోలేకపోయిన యశస్వి జైస్వాల్ వన్‌డౌన్‌లో జట్టులోకి వచ్చే చాన్సుంది. బౌలింగ్‌లో స్పిన్నర్ కుల్దీప్యాదవ్ను తుదిజట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. తొలి వన్డేలో రాణించిన గుర్నూర్ బ్రార్ కొనసాగనున్నాడు.