రియో(బ్రెజిల్): వుషు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన వేర్వేరు విభాగాల్లో భారత వుషు ప్లేయర్లు నాలుగు పతకాలతో చరిత్ర సృష్టించారు. మహిళల 75కిలోల విభాగంలో శివానీ, అపర్ణ(52కి), కరీనా(60కి) ప్రత్యర్థుల చేతిలో ఓడి రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు పురుషుల 56కిలోల విభాగంలో సాగర్‌కు కాంస్య పతకం దక్కింది.