ఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. పొట్టి పోరుకు సన్నాహకంగా జరిగే ఈ సిరీస్‌లో ఉమెన్ ఇన్ బ్లూ.. సఫారీలతో ఐదు టీ20లు ఆడనుంది. ఏప్రిల్ 17 నుంచి 27 దాకా జరుగబోయే ఈ సిరీస్‌లో మ్యాచ్‌లకు డర్బన్, జోహన్నెస్‌బర్గ్, బెనోని ఆతిథ్యమివ్వనున్నాయి.