BCCI | న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు షెడ్యూల్ తెలుసా..?
BCCI : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భారత జట్టు (Team India) త్వరలోనే సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ (Newzealand)తో వన్డే సమరం మొదలవ్వనుంది.
BCCI : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భారత జట్టు (Team India) త్వరలోనే సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ (Newzealand)తో వన్డే సమరం మొదలవ్వనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (ICC Womens Championship)లో భాగంగా టీమిండియా దాంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షెడ్యూల్‌ను ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకూ ఆతిథ్యం ఇవ్వనుందని బీసీసీఐ వెల్లడించింది.
‘వరల్డ్ కప్ ముగిశాక హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ వన్డే సవాల్‌కు సిద్దం కానుంది. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. టీమిండియా అక్టోబర్ 24న మంగళవారం మొదటి వన్డే ఆడనుంది. అనంతరం అక్టోబర్ 27న రెండో వన్డే, అక్టోబర్ 29వ తేదీన మూడో వన్డే జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం(IST) మధ్యాహ్నం 1:30 గంటలకు మూడు వన్డేలు ప్రారంభం అవుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు కూడా నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
తొలి వన్డే : అక్టోబర్ 24 – మధ్నాహ్నం 1:30 గంటలకు – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్.
రెండో వన్డే : అక్టోబర్ 27 – మధ్నాహ్నం 1:30 గంటలకు – నరేంద్ర మోడీ స్టేడియం
మూడో వన్డే : అక్టోబర్ 29 – మధ్నాహ్నం 1:30 గంటలకు – నరేంద్ర మోడీ స్టేడియం
ఈ సిరీస్ మన అమ్మాయిలకు ఎంత ముఖ్యమో కివీస్‌కు కూడా అంతే ముఖ్యం. వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టుకు గెలిచి తీరాల్సిందే. ప్రస్తుతానికైతే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు వరల్డ్ కప్ బెర్తు సొంతం చేసుకున్నాయి.

ఏక కాలంలో రెండు జట్లు
మరో విషయం ఏంటంటే.. ఏక కాలంలో న్యూజిలాండ్ మహిళల, పురుషుల జట్లు భారత పర్యటనకు రాబోతున్నాయి. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్ కోసం పురుషుల జట్టు రానుంది. శ్రీలంకపై రెండు టెస్టుల్లో ఓడిపోయి 2-0తో సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ భారత గడ్డపై మళ్లీ గెలుపు బాట పట్టాలనే కసితో ఉంది. అయితే.. కీలకమైన ఈ పర్యటనకు మాజీ సారథి కేన్ విలిమయ్సన్ (Kane Williamson) అందుబాటులో ఉండడం లేదు. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 16 నుంచి తొలి టెస్టు మొదలవ్వనుంది.
ఇవి కూడా చదవండి
- Stock Market Close | మార్కెట్లలో జోష్.. 591 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..
- Musi River | మా ఇండ్లను కూల్చకండి.. మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిసిన హైకోర్టు స్టే ఆర్డర్లు
- Paksitan vs England | ముల్తాన్ టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు.. యువకెరటానికి పిలుపు
- TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఐదురోజులు వానలే వానలు..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lakshmi Verma | బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మకు రోడ్డు ప్రమాదం.. చేతికి ఫ్రాక్చర్
వార్డుల వారీగా జీవిత బీమా కౌంటర్లు : ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్ది
‘వైరాలో దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి’
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

