న్యూఢిల్లీ: ఎన్నాళ్లకెన్నాళ్లకు! హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో సెప్టెంబర్ 20న మొహాలీలో తొలి మ్యాచ్, నాగ్పూర్ (సెప్టెంబర్ 23), హైదరాబాద్ (సెప్టెంబర్ 25) మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ పేర్కొంది.
మెగాటోర్నీకి ఎంపిక చేసిన జట్టు ఆసీస్తో పాటు దక్షిణాఫ్రికాతో మరో మూడు టీ20 మ్యాచ్ల్లో పోటీపడుతుంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు సఫారీలతో టీ20 సిరీస్ అటు తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది.