ఆక్లాండ్: న్యూజిలాండ్‌లో ఇండియా పర్యటించనున్నది. ఆ రెండు దేశాల మధ్య అతిపెద్ద ద్వైపాక్షిక క్రికెట్(India Vs New Zealand) సిరీస్ జరగనున్నది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జరిగే ఈ సిరీస్‌లో 5 టీ20 మ్యాచ్‌లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నారు. సుమారు 40 రోజుల పాటు ఈ సిరీస్ కొనసాగనున్నది. ఇప్పటిక వరకు రెండు దేశాల మధ్య జరగబోయే అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ ఇదే కానున్నది. న్యూజిలాండ్ పర్యటనలో మొత్తం 12 మ్యాచ్‌లు ఉండనున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంత భారీ సంఖ్యలో అక్కడ సిరీస్ జరగలేదు. రెండు దేశాల మధ్య క్రీడాసంబంధాలకు వందేళ్లు నిండిన నేపథ్యంలో ఈ భారీ సిరీస్‌కు ప్లాన్ చేశారు.
అక్టోబర్ 22వ తేదీన తొలి టీ0 మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లో జరగనున్నది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. నవంబర్ 4వ తేదీన ఆక్లాండ్‌లో తొలి వన్డే జరుగుతుంది. ఇక నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్‌లో జరగనున్నది. కేవలం క్రికెట్ సిరీస్ మాత్రమే కాదు అని, రెండు దేశాల మధ్య చరిత్ర, సంస్కృతి సంబంధాలకు చెందిన సంబరాలు జరగనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గ్లెన్ క్రిట్‌చెల్లీ తెలిపారు.
కోహ్లీ, బుమ్రా లాంటి ఆటగాళ్లు కూడా ఈ టూర్‌కు వస్తారని, దానికి తగినట్లు తాము ప్రిపేరవులున్నట్లు కివీస్ మార్కెటింగ్ చీఫ్ చెప్పారు.2019-20 సీజన్ తర్వాత న్యూజిలాండ్‌కు భారత్ వెళ్లలేదు. కానీ ఆ తర్వాత రెండుసార్లు ఇండియాలో కివీస్ టూర్ చేసింది.
26 matches, 8 cities and a mega tour from India 👌
The 2026-27 International Schedule is here!
Join CRICKET NATION at https://t.co/3YsfR1Y3Sm for an exclusive ticket pre-sale in August 🎟️ pic.twitter.com/j1uKjTOYYm
— BLACKCAPS (@BLACKCAPS) June 3, 2026