World Championship : భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రీడా పండుగకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే వరల్డ్ చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) హక్కులు దక్కించుకున్న ఇండియా వచ్చే ఏడాది జరుగబోయే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (World Championship 2026) పోటీలను నిర్వహించనుంది భారత్. పారిస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ ముగింపు వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వెల్లడించింది. దాంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.
బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు ఖునింగ్ పతామ లీస్వడ్రకుల్ టోర్నీ ముగింపు సందర్భంగా భారత బ్యాడ్మింటన్ సంఘం జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రాకు వచ్చే ఏడాది ఆతిథ్య హక్కుల విషయాన్ని తెలియజేశారు. పారిస్‌లో విజయవంతంగా నిర్వహించినట్టుగానే భారత్‌లోనూ ఈ టోర్నీని జరుపుతామని బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్‌కు మిశ్రా మాటిచ్చారు.
The BWF World Championships are New Delhi–bound in 2026! 🏸🇮🇳
From France to India—handed over by BWF President Khunying Patama Leeswadtrakul and FFBaD’s Frank Laurent to BAI General Secretary, Sanjay Mishra, the road to the 30th edition in August 2026 begins now. 🔜… pic.twitter.com/IfZXWYdLnz
— BAI Media (@BAI_Media) September 1, 2025
‘పారిస్‌లో పాటించిన ప్రమాణాలకు ఒక్క శాతం కూడా తగ్గకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తాం. ప్రపంచ నలుమూలలా నుంచి రాబోతున్న బ్యాట్మింటన్ కుటుంబానికి ఢిల్లీలో స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నాం’ అని మిశ్రా చెప్పినట్టు బీఏఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
వచ్చే ఏడాది ఆగస్టులో ఢిల్లీ వేదికగా ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగున్నాయి. ఇదివరకూ.. 2009లో హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ జరిగింది. 2018లో చైనా ఆతిథ్యం ఇవ్వగా.. ఇప్పుడు భారత్ నిర్వహించనుంది. దాంతో.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ ఆసియా దేశంలో జరుగునున్నాయి.
🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/fEyrvjgezF
— BAI Media (@BAI_Media) September 1, 2025