భారత్‌లో వన్డే ప్రపంచకప్
ఇప్పటికే పలుమార్లు ఐసీసీ మేజర్ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భారత్.. రాబోయే నాలుగేండ్లలో మరో రెండు ప్రధాన టోర్నీలను నిర్వహించనుంది. 2029లో చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2031 వన్డే ప్రపంచకప్‌నకూ భారత్ ఆతిథ్యమివ్వనుంది. చాంపియన్స్ ట్రోఫీని సోలోగా నిర్వహించనున్న భారత్.. వన్డే వరల్డ్‌కప్‌నకు బంగ్లాదేశ్‌తో పాటు కలిసి ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు బాలీలో జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బాలి: ఇప్పటికే పలుమార్లు ఐసీసీ మేజర్ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భారత్.. రాబోయే నాలుగేండ్లలో మరో రెండు ప్రధాన టోర్నీలను నిర్వహించనుంది. 2029లో చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2031 వన్డే ప్రపంచకప్‌నకూ భారత్ ఆతిథ్యమివ్వనుంది. చాంపియన్స్ ట్రోఫీని సోలోగా నిర్వహించనున్న భారత్.. వన్డే వరల్డ్‌కప్‌నకు బంగ్లాదేశ్‌తో పాటు కలిసి ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు బాలీలో జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మీటింగ్‌లో 2035 వరకు మెన్స్ క్రికెట్లో జరుగనున్న ప్రధాన టోర్నమెంట్ల విండోలను ఖరారు చేసి ఆమోదించారు. 2028 టీ20 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నిర్వహించనుండగా 2030లో ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్లో టోర్నీ జరుగుతుంది. 2032, 2034కు గాను ఇంకా వేదికలు ఖరారు కాలేదు. ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ)లో తర్వాతి రెండు ఎడిషన్లతో పాటు 2035 వన్డే వరల్డ్ కప్‌నకు ఇంకా వేదికను ఖాయం చేయలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

