డీఏ చెల్లింపుల్లో వివక్ష.. ఎస్సీ గురుకులంలో వింత పరిస్థితి
డీఏ (కరువు భత్యం) చెల్లింపులోనూ సర్కార్ వివక్ష చూపుతున్నది. ఒకే గురుకులంలో ప్రధాన కార్యాలయంలోని సిబ్బందికి డీఏ బకాయిలు చెల్లిస్తూ, ఇతర సిబ్బందికి మాత్రం మొండిచెయ్యి చూపుతున్నది.
- హెడ్డాఫీస్ సిబ్బందికే ఇస్తున్న వైనం
- ఇతర సిబ్బందికి ఎదురుచూపులే
- 2021 నుంచి టీచర్ల నిరీక్షణ.. మొత్తం బకాయిలు రూ. 70 కోట్లు
- తక్షణమే విడుదల చేయాలని వివిధ అసోసియేషన్ల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : డీఏ (కరువు భత్యం) చెల్లింపులోనూ సర్కార్ వివక్ష చూపుతున్నది. ఒకే గురుకులంలో ప్రధాన కార్యాలయంలోని సిబ్బందికి డీఏ బకాయిలు చెల్లిస్తూ, ఇతర సిబ్బందికి మాత్రం మొండిచెయ్యి చూపుతున్నది. దీంతో డీఏ బకాయిల కోసం ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. డీఏ బకాయిల టోకెన్లు ఇస్తున్న ప్రభుత్వం.. నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో 2021 నుంచి ఇప్పటివరకు మొత్తంగా రూ.70 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి రాష్ట్రం ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదిలో రెండుసార్లు అంటే జనవరి, జూన్‌లో కరువు భత్యాన్ని ప్రకటిస్తుంది.
ఎస్సీ గురుకుల సొసైటీలో 2021 నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. కేవలం ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి మాత్రమే చెల్లిస్తూ, మిగతా సిబ్బందికి మాత్రం ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని సొసైటీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. డీఏ చెల్లింపుల కోసం సొసైటీ హెడ్ ఆఫ్ అకౌంట్ పేరిట 310/311 కింద చెకులు జారీ అయినా ఇప్పటికీ ఉద్యోగులకు బకాయిలు అందకపోవడం గమనార్హం. ఆ చెకుల వివరాల ప్రకారం జూలై 2021 నుంచి జూలై 2026 వరకు మొత్తం 11 చెకుల ద్వారా రూ.70,60,85,768 బకాయిలున్నాయి.
పట్టించుకోని మంత్రి, ఉన్నతాధికారులు
డీఏ బకాయిల కోసం భారీ మొత్తాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు సూచిస్తున్నా అర్హులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ బకాయిలు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. బకాయి డీఏలు విడుదల చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు, సొసైటీ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వాయిదాలు వేస్తున్నారే తప్ప విడుదల చేయడం లేదని వారు మండిపడుతున్నారు.
ఎందుకీ వివక్ష : టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ
ప్రధాన కార్యాలయ ఉద్యోగులకు డీఏలు చెల్లించి, సంస్థలో పనిచేసే ఇతర సిబ్బందికి ఎందుకు చెల్లించలేదనే దానిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ) చైర్మన్ డాక్టర్ రామలక్ష్మణ్, నాయకుడు బాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని డీఏ బకాయిలు చెల్లించాలని, అందుకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. అర్హత కలిగిన ఏ ఒక ఉద్యోగి కూడా తన న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలు కోల్పోకుండా తక్షణ ఆదేశాలు జారీచేయాలని, లేదంటే ఐక్యంగా ఉద్యమిస్తామని ఒక ప్రకటనలో హెచ్చరించారు.
తేదీల వారీగా నమోదైన బకాయిల వివరాలు
2021 జూలై నుంచి 2026 జూలై వరకు మొత్తం 11 చెకుల ద్వారా రూ.70,60,85,768 బకాయిలున్నాయి.
01.07.2021 నుంచి 31.01.2023 వరకు రూ.14,72,47,578
01.01.2023 నుంచి 31.07.2025 వరకు రూ.9,87,37,428
2025 సెప్టెంబర్‌కు రూ.1,59,34,999
2025 అక్టోబర్‌కు రూ.1,59,34,999
2025 నవంబర్ నుంచి 2026
జనవరి వరకు రూ.4,78,04,997
2026 ఫిబ్రవరిలో రూ.20,88,88,576.. అదే నెలకు మరో రూ.1,59,34,999
2026 మార్చిలో రూ.3,74,94,438
2026 మేలో రూ.7,49,88,876
2026 జూన్‌లో రూ.2,15,59,439
2026 జూలైలో రూ.2,15,59,439 బకాయిలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

