లీడ్స్ : శుభమన్ గిల్ నేతృత్వంలో టీమిండియా జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. లీడ్స్ లో ఇవాళ ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ప్రారంభం అవుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకున్నది. ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేసేవాళ్లమని గిల్ పేర్కొన్నాడు. జట్టులోకి సాయి సుదర్శన్‌ను తీసుకున్నట్లు గిల్ తెలిపాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సాయి.. టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ కూడా తుది జట్టులో స్థానం సంపాదించాడు. ఇంగ్లండ్ జట్టులో పోప్‌కు స్థానం కల్పించినట్లు కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. బౌలింగ్ యూనిట్లో వోక్స్, కార్సేలు చోటు సంపాదించారు.
#TeamIndia‘s Playing XI for the 1st Test 🙌
Sai Sudharsan makes his Test Debut 👏👏
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/r4UkgH2pZ4
— BCCI (@BCCI) June 20, 2025