ENG Vs IND Test | బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా 15 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. తొలి టెస్టులో అదరగొట్టిన కేఎల్ రాహుల్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో వోక్స్ వేసిన బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వోక్స్ వేసిన బంతి రాహుల్ బ్యాట్‌కు తగిలి వికెట్లను తాకింది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్ తుది జట్టు నుంచి తప్పించింది. వారి స్థానంలో నితిశ్‌కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్‌లకు టీమ్ మేనేజ్మెంట్ చోటు కల్పించింది. ఇంగ్లండ్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ప్రస్తుతం టీమిండియా 10.4 ఓవర్లకు గాను వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం కరుణ్ నాయర్ 5, జైశ్వాల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.