INDW vs NZW : హ్యాట్రిక్ ఓటములు.. సెమీస్ ఆశలు ఆవిరవుతున్నవేళ అందరిలో ఆందోళన.. గెలుపే శరణ్యం అయిన మ్యాచ్‌లో భారత జట్టు పంజా విసిరింది. బ్యాటింగ్. బౌలింగ్. ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతీకా రావల్(122), స్మృతి మంధాన(109)లు శతకాలతో కదం తొక్కగా.. సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ బ్యాటర్లకు కళ్లెం వేసింది. 325 పరుగుల ఛేదనలో ప్రత్యర్ధిని కట్టడి చేసి ..డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 53 పరుగుల తేడాతో గెలుపొంది ఐదోసారి సెమీస్‌కు దూసుకెళ్లింది.
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఫేవరెట్ భారత జట్టు.. అదిరే విజయంతో సెమీస్‌లో అడుపెట్టింది. వరుసగా మూడు ఓటముల నుంచి తేరుకున్న టీమిండియా.. భారీ స్కోర్‌తో న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. వర్షం అంతరాయంతో వైట్ ఫెర్న్స్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్దేశించారు. బ్యాటర్ల విధ్వంసంతో న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ వికెట్ల వేట మొదలెట్టింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ తన తొలి ఓవర్లోనే వికెట్ అందించింది. పెద్ద షాట్ ఆడే తొందరలో కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్(1) బంతిని గాల్లోకి లేపింది. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీక రావల్ ఒడుపుగా క్యాచ్ అందుకోగా.. ఒక్క పరుగు వద్దే వైట్ ఫెర్న్స్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం అమేలియా కేర్ (45 ).. జార్జియా పిమ్మర్(30)లు ఆచితూచి ఆడారు. రేణుకా సింగ్ వేసిన 8వ ఓవర్లో ప్లిమ్మర్ రెండు, కేర్ ఒక ఫోర్ బాదారు.
𝐐𝐔𝐀𝐋𝐈𝐅𝐈𝐄𝐃 👏#TeamIndia seal their spot in the semi-finals with a convincing win against New Zealand 🇮🇳🙌
Scorecard ▶ https://t.co/AuCzj0Wtc3#WomenInBlue | #CWC25 | #INDvNZ pic.twitter.com/iHOc9hf8cR
— BCCI Women (@BCCIWomen) October 23, 2025
ఆ తర్వాత స్నేహ్ రానా ఓవర్లో సిక్సర్ కొట్టిన ప్లిమ్మర్ చివరకు రేణుక ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయింది. క్రీజులోకి వస్తూనే బౌండరీతో ఖాతా తెరిచిన కెప్టెన్ సోఫీ డెవినె(4) సైతం రేణుకా ఓవర్లో బౌల్డ్ కావడంతో కివీస్ కష్టాల్లో పడింది. అమేలియా, బ్రూక్ హల్లిడే(81)లు విలువైన రన్స్ జోడించి స్కోర్ వంద దాటించారు. రానా ఓవర్లో మంధాన స్టన్నింగ్ క్యాచ్‌తో అమేలియా ఔటయ్యింది. మళ్లిడే పట్టుదలగా ఆడిన . స్వీప్, పవర్ఫుల్ షాట్లతో చెలరేగి అర్ధ శతకంతో మెరసింది. ఆరో వికెట్‌కు ఇసబెల్లా గేజ్(65 నాఔట్)తో కలిసి 72 రన్స్ రాబట్టిన ఆమెను శ్రీచరణి పెవిలియన్ పంపింది. అయినా కూడా ఇస్ కేర్(18), గేజ్ ధనాధన్ ఆడుతూ స్కోర్ 260 దాటించారు. చివరి బంతికి రోస్మెరీ(1) ఔట్ కావడంతో 53 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా సెమీస్‌లో అడుపెట్టింది.
Sree Charani turns partnership-breaker! 💪
Sneh Rana with the catch! 🫴
Wicket no. 6️⃣ for #TeamIndia
Updates ▶ https://t.co/AuCzj0X11B#WomenInBlue | #CWC25 | #INDvNZ pic.twitter.com/YDvSzgWmPe
— BCCI Women (@BCCIWomen) October 23, 2025
చావోరేవో పోరులో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) న్యూజిలాండ్ బౌలర్లను
విసిగిస్తూ శతకాలతో రెచ్చిపోయారు. వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు గట్టి పునాది వేశారిద్దరూ. రెండొందలు జోడించిన ఈ ద్వయం వెనుదిరిగాక. జెమీమా రోడ్రిగ్స్(76 నాటౌట్) విధ్వంసక హాఫ్ సెంచరీతో స్కోర్‌బోర్డును ఉరికించింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 49వ ఓవర్లకు కుదించగా.. జెమీమా, రీచా ఘోష్(4 నాటౌట్) చెరొక బౌండరీ కొట్టడంతో.. టీమిండియా ప్రత్యర్థికి 341 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.