
నైరోబి: ప్రతిష్ఠాత్మక అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. నైరోబిలో బుధవారం జరిగిన మిక్స్డ్ 4X 400 రిలే పరుగుపందెంలో భారత్ కాంస్య పతకం సాధించింది. భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్‌తో కూడిన భారత బృందం.. 3 నిమిషాల 20.60 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. నైజీరియాకు స్వర్ణం దక్కగా పోలండ్ రజత పతకం నెగ్గింది. గతంలో ఈ మెగాటోర్నీలో సీమా అంటిల్(డిస్కస్‌త్రో), నవ్జీత్కౌర్(డిస్కస్ త్రో), నీరజ్‌చోప్రా(జావెలిన్ త్రో), హిమదాస్(400మీ) పతకాలతో మెరిశారు.