అమెరికా మంత్రుల నివాసాలపై డ్రోన్లు
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నివాసాల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించాయి. మంత్రుల నివాసాలతో పాటు అమెరికా సైనిక స్థావరం కూడా అయిన ఫోర్ట్ లెస్లీ జే, మెకనైర్ మీదుగా గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతున్నట్టు అధికారులు గుర్తించారు.
- అప్రమత్తమైన భద్రతా దళాలు
వాషింగ్టన్, మార్చి 19: పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నివాసాల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించాయి. మంత్రుల నివాసాలతో పాటు అమెరికా సైనిక స్థావరం కూడా అయిన ఫోర్ట్ లెస్లీ జే, మెకనైర్ మీదుగా గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. అయితే ఇవి ఏ దేశానికి చెందిన డ్రోన్‌లో అధికారులు కనిపెట్ట లేకపోయారు. మిలిటరీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నదని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
డ్రోన్ల కదలికలపై అప్రమత్తమైన అమెరికా దేశంలోని తమ మిలిటరీ స్థావరాల భద్రతను ముమ్మరం చేసింది. డ్రోన్ల కదలికల అనంతరం మంత్రులు మెకనైర్, పీట్ హెగ్సెత్లను వేరే ప్రాంతాలకు తరలించేందుకు యోచిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ప్రస్తుతానికైతే వారు తమ పాత నివాసాల్లోనే కొనసాగుతున్నారని పేర్కొన్నది. రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో అమెరికా తన దౌత్య కార్యాలయాలకు ప్రపంచ వ్యాప్త భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

