న్యూఢిల్లీ, మార్చి19 : పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు ఇరాన్ గట్టి షాక్లే ఇస్తున్నది. అమెరికా యుద్ధ విమానం ‘ఎఫ్-35’ను ఇరాన్ కూల్చివేసినట్టు వార్తలు వెలువడ్డాయి. గురువారం ఇరాన్ దాడులతో మంటల్లో చిక్కుకున్న ఎఫ్-35ను అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు ‘సీఎన్ఎన్’ వార్తా కథనం పేర్కొన్నది. దానిని నడుపుతున్న పైలట్ ప్రాణాలకు ముప్పేమీ లేదని అమెరికా వర్గాలు తెలిపాయి.
యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా యుద్ధ విమానాన్ని పడగొట్టడం ఇదే మొదటిసారి. దీనిపై యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ, ‘ఎఫ్-35 ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పశ్చిమాసియాలో అమెరికా ఎయిర్‌బేస్ వద్ద సురక్షితంగా దిగింది. దానిని నడుపుతున్న పైలట్‌కు ప్రాణాపాయం లేదు’ అని అన్నారు.