INDW vs SLW : వర్షం పడడంతో నిలిచిపోయిన మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ మళ్లీ మొదలైంది. సిబ్బంది చకచకా సూపర్ సాపర్స్ సాయంతో ఔట్ ఫీల్డ్ సిద్ధం చేశారు. దాంతో సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ మొదలవుతుందని అంపైర్లు భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టుకు చెప్పారు. అయితే.. వర్షం కారణంగా రెండు ఓవర్లు తగ్గించి ఆడిస్తామని తెలిపారు. దాంతో.. ఇరుజట్లకు 48 ఓవర్ల మ్యాచ్ ఉండనుంది. భారత జట్టు 11వ ఓవర్ నుంచి 43-1తో ఇన్నింగ్స్ కొనసాగించనుంది.
గువాహటి వేదికగా ఆతిథ్య భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఆరంభ పోరు ప్రారంభమైన కాసేపటికే వర్షం మొదైలంది. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. 10 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టానికి43 పరుగులు స్కోర్ చేసింది. టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగగా ఆదిలోనే ఓపెనర్ స్మృతి మంధాన(8) ఔటయ్యింది. ఆ తర్వాత ఓపెనర్ ప్రతీకా రావల్(18 నాటౌట్), హర్లీన్ డియోల్(15 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ఉరికించారు. దాంతో 10 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టానికి43 పరుగులు స్కోర్ చేసింది.
And we officially have a restart time with reduced overs. Let’s hope 🌧️ stays away from here #INDvSL
Follow live ➡️ https://t.co/GCydOeI61x pic.twitter.com/i2Y1Ypmova
— ESPNcricinfo (@ESPNcricinfo) September 30, 2025