న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు భారత వెటరన్ ప్లేయర్ గౌహర్ సుల్తానా వీడ్కోలు పలికింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉందని తెలిపింది.
తన కెరీర్లో టీమ్ఇండియా తరఫున 50 వన్డేలు 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన 37 ఏండ్ల హైదరాబాదీ సుల్తానా లెఫ్టార్మ్ స్పిన్‌తో వికెట్ల వేట కొనసాగించింది. వన్డేల్లో 19.39 సగటుతో 66 వికెట్లు తీసిన సుల్తానా టీ20ల్లో 26.27 సగటుతో 29 వికెట్లు ఖాతాలో వేసుకుంది. కెరీర్లో 2009, 2013 వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడిన ఈ హైదరాబాదీ స్పిన్నర్ 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసింది.