చెంగ్జూ : భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రజావత్.. 13-21, 16-21తో బ్రియాన్ యంగ్ (కెనడా) చేతిలో పరాభవం పాలయ్యాడు. రజావత్ ఓడటంతో ఈ టోర్నీ మెన్స్ సింగిల్స్ విభాగంలో కిరణ్ జార్జి ఒక్కడే బరిలో మిగిలాడు.