బ్రిస్బేన్: బ్రిస్బేన్ టెస్టు(AUSvIND)లో ఖతర్నాక్ సవాల్ విసిరింది ఆస్ట్రేలియా. ఇండియాకు 275 రన్స్ టార్గెట్ ఇచ్చింది. నిజానికి అయిదో రోజు అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. ఆస్ట్రేలియా ఒక్కసారిగా కుప్పకూలింది. 7 వికెట్లు కోల్పోయి 89 రన్స్ చేసిన దశలో రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. వర్షం వల్ల తొలి సెషన్ చాలా వరకు నిలిచిపోగా.. ఇక రెండవ సెషన్లో ఆసీస్ బ్యాటర్లు దారుణంగా తడబడ్డారు. ఒక్కొక్కరిగా పెవిలియన్‌కు చేరుకున్నారు. భారత పేస్ బౌలర్లు విజృంభించడంతో.. ఆసీస్ టాపార్డర్ తోకముడిచింది.
Innings Break!
Australia have declared after posting 89/7 in the 2nd innings.#TeamIndia need 275 runs to win the 3rd Test
Scorecard – https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/bBCu6G0pN5
— BCCI (@BCCI) December 18, 2024
భారీ వర్షం పొంచి ఉన్న బ్రిస్బేన్‌లో.. భారత బౌలర్లు ప్రతాపం చాటారు. బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్..ఆకాశ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇవాళ మరో 55 ఓవర్లు మిగిలి ఉన్నాయి. దీంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. భారత్ వైపు మ్యాచ్ వెళ్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత పేస్ బౌలర్ల ధాటికి.. మ్యాచ్ అనూహ్యమైన ట్విస్ట్ తీసుకున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 260కి ఆలౌటైంది. ఆసీస్ పేసర్లను సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.