Team India : కోల్‌కతా టెస్టులో గాయపడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) రెండో మ్యాచ్‌కూ దురమయ్యాడు. తదుపరి పరీక్షల కోసం ముంబై చేరుకున్న గిల్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లోపు కోలుకుంటాడా? లేదా? అనేది తెలియడం లేదు. మరోవైపు వన్డే స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ గిల్ ఆలోపు ఫిట్‌గా లేకుంటే సారథిగా వ్యవహరించేది ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనతో గిల్‌కు పగ్గాలు అప్పగించిన సెలెక్టర్లు ఈసారి ఎవరికి ఓటేస్తారు? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో అజేయ శతకంతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను తిరిగి నాయకుడిగా నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందే భారత జట్టుకు కెప్టెన్సీ సమస్య తలెత్తింది. డిసెంబర్ 3 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ సిరీస్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటీవలే సారథ్యం స్వీకరించిన గిల్ అనుకోకుండా మెడ నొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. వన్డే సిరీస్ లోపు అతడు కోలుకుని ఫిట్నెస్ సాధించే అవకాశాలు తక్కువే. ఈ పరిస్థితుల్లో మరొకరిని కెప్టెన్ చేయక తప్పదు. ఈమధ్య సీనియర్లను పక్కన పెట్టేస్తున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ ఎవరికి కెప్టెన్సీ ఇస్తారు? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మకు మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారా?.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లలో ఒకరిని ఎంచుకుంటారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
🚨 Shubman Gill replaces Rohit Sharma as India’s ODI captain pic.twitter.com/eHm1EfdgJg
— Cricbuzz (@cricbuzz) October 4, 2025
గిల్ గాయపడడంతో వన్డే కెప్టెన్సీపై ఆశలు పెట్టుకున్న శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు కచ్చితంగా అవకాశం దక్కేది. కానీ, ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు పరిశీలనలో రోహిత్, రాహుల్, పంత్ పేర్లు మాత్రమే ఉన్నాయి.
జట్టుకోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే రాహుల్‌ను విస్మరించకూడదని కొందరి వాదన. ఓపెనర్ నుంచి ఏడో స్థానంలో.. ఎక్కడంటే అక్కడ ఆడుతూ జట్టు మనిషిగా పేరు తెచ్చుకున్న అతడికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటివరకూ రాహుల్ 15 వన్డేల్లో నాయకత్వం వహించి.. 9 విజయాలు అందించాడు. సారథిగా బ్యాటుతోనూ రాణించి 302 రన్స్ చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా అదరగొట్టిన పంత్.. చివరి వన్డే ఆడి దాదాపు ఏడాది అవుతోంది. టీ20ల్లో ఐదుసార్లు కెప్టెన్‌గా ఉన్న పంత్.. వన్డే జట్టును ఇంతవరకూ నడిపించలేదు. కాబట్టి రోహిత్‌కు బాధ్యతలు ఇవ్వడం మంచిదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
MS Dhoni ➡️ Virat Kohli ➡️ Rohit Sharma
Here is a look at the captaincy records of Team India’s last three skippers ©️📊 pic.twitter.com/BTTUbqNG8c
— Sport360° (@Sport360) October 6, 2025
ఇప్పటివరకూ 56 మ్యాచుల్లో భారత జట్టుకు నేతృత్వం వహించిన అతడు.. 42 విజయాలు సాధించి పెట్టాడు. పైగా.. వచ్చే వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాడు హిట్‌మ్యాన్. అందుకే.. అతడికే సారథ్యం ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. అనభవం.. ఫామ్ ఇలా ఏరకంగా చూసినా రాహుల్ లేదంటే రోహిత్.. ఇద్దరిలో ఒకరికి బాధ్యతలు ఇవ్వడమే శ్రేయస్కరం. అయితే.. ఆదివారం సమావేశం కానున్న సెలెక్టర్లు వన్డే స్క్వాడ్ ప్రకటించే సమయంలోనే కెప్టెన్ పేరును వెల్లడించే అవకాశముంది.
ROHIT SHARMA HAS PHENOMENAL RECORD AT SCG. 💪 pic.twitter.com/uNxSk27orD
— Johns. (@CricCrazyJohns) October 24, 2025