చెన్నై: బంగ్లాదేశ్(Ind Vs Ban)తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భోజన విరామ సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 88 రన్స్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(37), రిషబ్ పంత్(33) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయితే ఆ జట్టు అనుకున్నట్లే వికెట్లను తీసింది. బంగ్లా బౌలర్ మహబూద్ కీలకమైన మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడతను.
Lunch on Day 1 of the 1st Test.#TeamIndia 88/3
Scorecard – https://t.co/fvVPdgXtmj… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/hshqX5Flfy
— BCCI (@BCCI) September 19, 2024
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా పెవిలియన్‌కు చేరుకున్నారు. మహమూద్ బౌలింగ్‌ను పంత్, జైస్వాల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. జైస్వాల్ తన డిఫెన్స్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. అటాకింగ్ షాట్లతో పాటు డిఫెన్స్ టెక్నిక్ తోనూ జైస్వాల్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ఇప్పటి వరకు పంత్ అయిదు ఫోర్లు, జైస్వాల్ ఆరు ఫోర్లు కొట్టారు.