Under-19 World Cup | అజేయ భారత్ అరుదైన ఫీట్.. లీగ్ చరిత్రలో తొలి జట్టుగా రికార్డు
Under-19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ -19 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు(Team India) అజేయంగా దూసుకెళ్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో మూడింటా జయకేతనం ఎగురవేసింది. విశేషం ఏంటంటే...
Under-19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ -19 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు(Team India) అజేయంగా దూసుకెళ్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో మూడింటా జయకేతనం ఎగురవేసింది. విశేషం ఏంటంటే.. ఈ మూడింటా 200 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, టోర్నీ చరిత్ర ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా యువ భారత్ రికార్డు నెలకొల్పింది.
బుధవారం సూపర్ సిక్స్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై ముషీర్ ఖాన్ వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు. అనంతరం బౌలర్లు సైమీ కుమార్ పాండే (4/19) , రాజ్ లింబానీ(2/17)లు విజృంభించడంతో కివీస్‌ను 214 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
India become the first team to win three consecutive U-19 ODIs by 200+ runs 🔥 pic.twitter.com/o70tj2uSqb
— ESPNcricinfo (@ESPNcricinfo) February 1, 2024
అండర్ -19 ప్రపంచ కప్‌లో ఉదయ్ సహరన్(Uday Saharan) నేతృత్వంలోని భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో రఫ్ఫాడిస్తోంది. తొలుత బ్యాటుతో బాదేసి.. ఆ తర్వాత బంతితో ప్రత్యర్థి జట్ల పని పడుతోంది. ఆరంభ పోరులో ఐర్లాండ్‌పై 201 రన్స్ తేడాతో గెలుపొందింది. ఆతర్వాత పసికూన అమెరికాను ఓ ఆట ఆడుకున్న భారత్ 201 పరుగుల తేడాతో ఓడించింది. ఫేవరేట్ న్యూజిలాండ్‌పై విజయంతో టీమిండియా ‘గ్రూప్ ఏ’లో టాప్‌లో ఉంది. శుక్రవారం జరిగేపోరులో ఉదయ్ సహరన్ సేన నేపాల్‌ను ఢీ కొట్టనుంది. ఆ మ్యాచ్‌లో గనుకు గెలిస్తే 8 పాయింట్లతో సెమీస్‌కు మరింత చేరువైంది.
ముషీర్ టాప్ స్కోరర్
టీమిండియా విజయాల్లో రంజీ పరుగుల వీరుడు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) తమ్ముడు ముషీర్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈటోర్నీలో ఓ రేంజ్లో ఆడుతున్న ముషీర్ అమెరికా, న్యూజిలాండ్‌పై సెంచరీలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.
ముషీర్ ఖాన్

నాలుగు మ్యాచుల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ బాదిన అతడు 325 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ 208 రన్స్‌తో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో స్పిన్నర్ సౌమీ పాండే 12 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి
- Union Budget 2024 | మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది: ఉద్ధవ్ ఠాక్రే
- Psycho | రాజేంద్రనగర్‌లో సైకో వీరంగం.. భారీగా ట్రాఫిక్ జామ్
- Accident | బావిలో పడ్డ కారు.. ఇద్దరు అరటి వ్యాపారులు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

