Harish Rao | 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.. లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు
ఎన్నికలకు ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్‌రెడ్డి, గద్దెనెకిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
- ఎనిమిది నెలలు గడిచాయి.. నాలుగు నెలల్లో
- రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తరు?
- మందబలంతో మా గొంతు నొక్కుతరేమో కానీ,
- ఆర్టీసీ కార్మికుల హృదయాలను గెలువలేరు
- అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు ఫైర్
Harish Rao | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్‌రెడ్డి, గద్దెనెకిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, యూనియన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల విషయం సభలో చర్చకు వచ్చినప్పుడు తాము సూటిగా ప్రశ్నలు వేసినప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని మండిపడ్డారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో, ఇప్పుడు ఏం చేస్తున్నదో ఆర్టీసీ కార్మికులు గమనిస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో ఆర్టీసీకి ముఖ్యమంత్రి ఇచ్చిన రూ.300 కోట్ల చెక్కు డమ్మీ అయింది. దాని సంగతి అడిగితే సమాధానం చెప్పలేదు. మహిళల ఉచిత బస్సులకు సంబంధించి ఏప్రిల్, మే నిధులు ఇవ్వలేదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఎరియర్స్ , బకాయిలు ఇవ్వాలి, యూనియన్ను పునరుద్ధరించాలని అడిగితే ఒక్కదానికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఆర్టీసీ కార్మికుల ఓట్లతో గెలిచి నేడు వారికి వెన్నుపోటు పొడిచింది. ఆర్టీసీ కార్మికుల పక్షాన సభలో, బయట ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
నిరుద్యోగుల సమస్యపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని వాయిదా తీర్మానం కోరితే స్పీకర్ తిరసరించారని ఫైరయ్యారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని, పత్రికల్లో, టీవీల్లో తేదీలతోసహా యాడ్స్ ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. మెగా డీఎస్సీయా.. దగా డీఎస్సీయా.. అనే ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, పాడి కౌశిక్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, విజేయుడు పాల్గొన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
గ్రూప్ -1 విషయంలో జీవో 55 రద్దు చే సి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడు మెయిన్స్‌లో 1:50 పద్ధతిలో అభ్యర్థులను పిలుస్తున్నారని, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో జగన్మోహన్రెడ్డి ప్రభు త్వం 1:100 పద్ధతి పాటించారని గుర్తుచేశా రు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇ చ్చి అదనపు ఉద్యోగాలు కల్పించిందని చెప్పా రు. అప్పుడు రాని సమస్యలు ఇప్పుడెందుకు వస్తాయని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

