కొలంబో: స్వదేశంలో భారత్‌తో జరుగబోయే రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందు శ్రీలంక క్రికెట్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా టీ20, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడని శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ తెలిపాడు. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పాడు. వైట్‌బాల్ ఫార్మాట్లో కీలకమైన చమీర గత ఏడాదిన్నర కాలంగా తరుచూ గాయాలతో సతమతమవుతున్నాడు.