గ్వాంగ్జు: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో రికర్వ్ విభాగంలో పతకం సాధించాలన్న భారత ఆశలు ఆవిరయ్యాయి. ఈ క్యాటగిరీలో భారత పతక ఆశలు మోస్తున్న 15 ఏండ్ల గాథ ఖడ్కే.. మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో నిష్క్రమించింది.
గురువారం ఆమె.. 0-6తో పారిస్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ప్రపంచ నెంబర్ వన్ ఆర్చర్ లిమ్ సి హ్యోన్ (దక్షిణ కొరియా) చేతిలో చిత్తుగా ఓడింది. రికర్వ్ విభాగంలో భారత్ చివరిసారి 2019లో రజతం గెలిచింది.