దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఆదివారం పసిడి పంట పండింది. పతకాల వేటలో పోటీపడిన భారత జూనియర్ బాక్సర్లు.. ఒకేరోజు నాలుగు స్వర్ణాలు సాధించారు. పురుషుల విభాగంలో రోహిత్ చమోలి (48 కేజీలు), భరత్ జూన్ (ప్లస్ 81 కేజీలు)లు బంగారు పతకాలు గెలువగా.. మహిళల విభాగంలో విషు రాఠి (48 కేజీలు), తను (52 కేజీలు)లు పసిడిని ముద్దాడారు. మరో బాక్సర్ గౌరవ్ సైని (70 కేజీలు) రజతంతో సరిపెట్టుకున్నాడు.