IND vs PAK : పొట్టి వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆలస్యంగా షురూ కానుంది. కారణం ఏంటంటే.. ప్రస్తుతం న్యూయార్క్‌లో వాన పడుతోంది. షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు టాస్ వేయాలి.
కానీ, అంతకుముందే నస్సౌ కౌంటీ స్టేడియంలో చినుకులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పేశారు. దాంతో, అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. వాన తగ్గాక టీమిండియా, పాక్ సారథులు రోహిత్ శర్మ, బాబర్ ఆజాంలు టాస్ కోసం మైదానంలోకి రానున్నారు.
బంతి బంతికి ఉత్కంఠ.. వికెట్ పడితే చాలు ప్రపంచాన్ని గెలిచేశామన్న రేంజ్లో బౌలర్ల సంబురాలు. మ్యాచ్ ఆసాంతం భావోద్వేగాలు.. ఉరిమిఉరిమి చూసుకొనే ఆటగాళ్లు.. ఇక కసికొద్దీ బ్యాటర్లు ఫోర్, సిక్సర్ బాదారనుకో స్టేడియం హోరెత్తిపోవాల్సిందే. ఇక ఎవరైనా హాఫ్ సెంచరీ కొట్టేశారంటే ఇక ఆ జట్టు డగౌట్లో జోష్ చూడాలసిందే. స్టాండ్స్‌లోని ప్రతి ఒక్కరూ మునివేళ్లపై నిలబడి చూసే మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాక్ మ్యాచ్ న్యూయార్క్‌లో జరుగుతున్నా.. ప్రపంచమంతా టీవీలముందు కళ్లార్పకుండా చూసేందుకు కాచుకొని ఉన్నారు.