Renuka Singh : మహిళల వన్డే వరల్డ్ కప్ ముందు భారత జట్టుకు గుడ్‌న్యూస్. కొన్నిరోజలుగా జట్టుకు దూరమైన ప్రధాన పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ (Renuka Singh Thakur) ఫిట్నెస్ సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో గాయపడిన రేణుకా ఈమధ్యే వైద్య పరీక్షలతో పాటు ఫిట్నెస్ పరీక్షలోనూ పాసైంది. దాంతో.. వరల్డ్ కప్ సన్నాహక సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనలో ఈ స్పీడ్‌స్టర్ బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని శనివారం కోచ్ అమొల్ మజందార్ వెల్లడించాడు.
‘రేణుకా సింగ్ జట్టుతో కలిసి నెట్స్ సెషన్లో పాల్గొంది. మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో గాయపడిన ఆమె ఈమధ్యే కోలుకుంది. ఫిట్నెస్ టెస్టుతో పాటు వైద్య పరీక్షల్లోనూ ఆమె పాసైంది. భారత జట్టులో రేణుక చాలా కీలకమైన ప్లేయర్. పేస్, మీడియం పేస్ దళానికి ఆమెనే నాయకురాలు. చెప్పాలంటే తను టీమిండియాలో అంతర్భాగం’ అని మజుందార్ తెలిపాడు.
𝙒𝙚𝙡𝙘𝙤𝙢𝙚 𝙗𝙖𝙘𝙠 𝙍𝙚𝙣𝙪𝙠𝙖 𝙎𝙞𝙣𝙜𝙝 𝙏𝙝𝙖𝙠𝙪𝙧! 🙌
Here’s how Day 1 of training looked like for the #TeamIndia pacer ⚡️#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/IvAZls9iDB
— BCCI Women (@BCCIWomen) September 12, 2025
గత కొంత కాలంగా రేణుకా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తూ.. జట్టుకు ఇప్పటివరకూ 19 వన్డేలు ఆడిన రేణుకా 4.85 ఎకానమీతో 35 వికెట్లు పడగొట్టింది. ఒకసారి ఐదు వికెట్లు, మరోసారి నాలుగు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టింది పేస్ గన్.
ఈసారి వరల్డ్ కప్ పోటీలకు శ్రీలంకతో కలిసి ఆతిథ్యమిస్తున్న భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 13 నుంచి ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఆసీస్‌ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో టోర్నీలో అడుగుపెట్టాలని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం భావిస్తోంది. తొలి ప్రపంచ కప్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా అన్ని విభాగాలను సరి చూసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచ కప్ షురూ కానుంది. ఆరభం పోరులో శ్రీలంకతో భారత్ తలపడనుంది.