INDW vs SLW : ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో శ్రీలంకపై భారీ విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్దమైంది. విశాఖలోనే జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసిన భారత జట్టు మళ్లీ టాస్ గెలుపొందింది. ఈసారి కూడా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ తీసుకుంది. గత మ్యాచ్‌లానే ప్రత్యర్థిని పడగొట్టాలని విమెన్ ఇన్ బ్లూ అనుకుంటుండగా.. మొదటి టీ20ల్లో బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
సిరీస్‌లో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లేందుకు వీలున్న ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ దీప్తిశర్మ దూరమైంది. ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నందున స్నేహ్ రానాకు తుది జట్టులోకి వచ్చింది. తొలి పోరులో కంగుతిన్న లంక ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. రాత్రి 7 గంటలకు తొలి బంతి పడనుంది.
A look at #TeamIndia’s Playing XI for the 2️⃣nd T20I 🙌
Updates ▶️ https://t.co/Umn9ZGAexw#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/ou94Jv5Us5
— BCCI Women (@BCCIWomen) December 23, 2025
భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ్ రానా, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు : విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిలాక్షి డిసిల్వా, కుశాని నుత్యంగన(వికెట్ కీపర్), కవిశ దిల్హరి, మల్కి మదర, ఇనొక రణవీర, కావ్య కవింది, శషిని గిహ్మని.