ఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలోనూ భారత షట్లర్లు వైఫల్య ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్.. 15-21, 10-21తో లిన్ చున్ యి (చైనీస్ తైఫీ) చేతిలో ఓడాడు. ప్రణయ్‌ను 21-16, 18-21, 18-21తో సు లి యంగ్ (చైనీస్ తైఫీ) ఓడించాడు. రజావత్.. 16-21, 22-21, 13-21తో నరకొర (జపాన్)కు తలవంచాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్.. 22-20, 16-21, 11-21తో హాన్ యూ (చైనా) చేతిలో ఓడిపోగా ఆకర్షి కశ్యప్.. 17-21, 13-21తో చోచువాంగ్ (థాయ్‌లాండ్) సైతం ఆమెను అనుసరించింది.
వడోదర: విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ఈ టోర్నీ తొలి సెమీస్‌లో కర్నాటక.. 5 వికెట్ల తేడాతో హర్యానాను ఓడించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా 50 ఓవర్లలో 237/9 పరుగులు స్కోరు చేసింది. లక్ష్యాన్ని కర్నాటక 47.2 ఓవర్లలోనే ఛేదించింది. దేవ్‌దత్ పడిక్కల్ (86), రవిచంద్రన్ (76) రాణించారు.
మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 15: జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-17 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో తెలంగాణ బాలుర, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో తెలంగాణ 18-07తో ఆంధ్రప్రదేశ్‌పై గెలవగా బాలికల విభాగంలో.. 12-09తో రాజస్థాన్‌పై విజయం సాధించింది.