భారతజట్టు వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిపోవడంతో జట్టు కూర్పుపై మాజీలు పెదవిరుస్తున్నారు. రెండు రోజుల మాజీ ఓపెనర్ సెహ్మాగ్ సీనియర్లను వచ్చే ప్రపంచకప్ జట్టుకి ఎంపికచేయొద్దని సెలక్టర్లను కోరాడు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుబ్లే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఛానెల్‌తో మాట్లాడుతూ… మూడు ఫార్మాట్లకు మూడు జట్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు. ‘టీ 20 స్పెషలిస్ట్‌లు తప్పనిసరిగా కావాలి. మెగా టోర్నీలో గెలవాలంటే ఆల్‌రౌండర్లు ఉండడం ఎంత అవసరమో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు నిరూపించాయి. ఇంగ్లండ్‌కు తప్ప ఏ క్రికెట్ జట్టుకు కూడా ఏడో స్థానంలోనూ చేలరేగి బ్యాటింగ్ చేయగల లియం లివింగ్‌స్టోన్ లాంటి ఆటగాడు లేడు. ఆస్ట్రేలియాకు ఆరో స్థానంలో మార్కస్ స్టొయినిస్ ఉన్నాడు ‘ అని కుంబ్లే అన్నాడు.
ప్రతి ఫార్మాట్‌కి ప్రత్యేకంగా కెప్టెన్, కోచ్ ఉండాల్సిన అవసరం రాకపోవచ్చని, ఎవరినీ జట్టులోకి తీసుకుంటారు, పరిస్థితులకు తగ్గట్టు జట్టుని ఎలా నడిపిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని కుంబ్లే చెప్పుకొచ్చాడు. కుంబ్లే 2016లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. లెగ్‌స్పిన్ బౌలర్ అయిన కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఘనత సాధించాడు. టెస్టుల్లో 619 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.