INDW vs AUSW : వన్డే ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న ఆస్త్రేలియా సెమీఫైనల్లోనూ దంచేసింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత బౌలర్లకు దడ పుట్టిస్తూ ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(119) శతక గర్జన చేయగా.. అలీసా పెర్రీ(77) హాఫ్ సెంచరీతో చెలరేగింది. వీరిద్దరి మెరుపులకు అష్ గార్డ్నర్ (63) విధ్వంసం తోడవ్వగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. శ్రీచరణి(2-49), దీప్తి శర్మ(2-73)లు రాణించడంతో 338కే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ప్రత్యర్ధి నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని ఛేదిస్తేనే మూడోసారి ఫైనల్ చేరాలనుకుంటున్న భారత జట్టు కల సాకారం కానుంది.
నాకౌట్ మ్యాచుల్లో చెలరేగిపోయే ఆస్ట్రేలియా ఈసారి కూడా భారీ స్కోర్‌తో విరుచుకుపడింది. సెమీఫైనల్లో టీమిండియా బౌలర్లు తేలిపోగా ఆ జట్టు బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఆదిలోనే కెప్టెన్ అలీసా హేలీ(5) వికెట్ కోల్పోయింది. క్రాంతి గౌడ్ ఆమెను ఔట్ చేసిన ఆనందాన్ని ఆవిరి చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగింది ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(119). భారత స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న తను.. రెండో వికెట్‌కు అలీసా పెర్రీ(77)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది.
𝗜𝗻𝗻𝗶𝗻𝗴𝘀 𝗕𝗿𝗲𝗮𝗸!
2⃣ wickets each for Sree Charani and Deepti Sharma 👍
1⃣ wicket each for Kranti Gaud, Amanjot Kaur, and Radha Yadav ☝️Over to our batters now!
Scorecard ▶ https://t.co/ou9H5gNDPT#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS pic.twitter.com/WRXlvLtfwL
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
చరణి ఓవర్లో బౌండరీతో వరల్డ్ కప్‌లో తొలి శతకం సాధించింది లిచ్‌ఫీల్డ్. 22 ఏళ్ల 195 రోజుల వయసలో సెంచరీ కొట్టిన తను.. అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. దీప్తి శర్మ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఆమెను అమన్‌జోత్ కౌర్ బౌల్డ్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అక్కడి నుంచి వికెట్ల పతనం మొదలైంది. అమన్‌జోత్ సంధించిన బంతిని లాప్ స్కూప్ షాట్ ఆడబోయిన లిచ్‌ఫీల్డ్ క్లీన్‌బౌల్డ్ అయింది. దాంతో.. 155 పరుగుల భాగస్వామ్యాన్నికి తెరపడింది. అప్పటికి29 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్.. 187-2.
లిచ్‌ఫీల్డ్, పెర్రీల దూకుడుతో ఆసీస్ స్కోర్ సులువుగా 350 దాటుతుందనిపించింది. కానీ, శ్రీచరణి(2-49) ఆ జట్టును దెబ్బకొడుతూ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసింది. పెర్రీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్న బేత్ మూనీ(24)ని సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ పంపింది జెమీమా రోడ్రిగ్స్. కాసేపటికే అనాబెల్ సథర్లాండ్(3)ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసింది చరణి. ఆ షాక్ నుంచి తేరుకోకముందే జెమీమా మెరుపు త్రోతో మెక్‌గ్రాత్‌ను రనౌట్ చేయగా ఆరో వికెట్ పడింది.
Jemimah Rodrigues 🤝 Richa Ghosh
The duo combines in the field and Tahlia McGrath is run-out! 👌#TeamIndia have Australia 6️⃣ down! 🔝
Updates ▶ https://t.co/ou9H5gNDPT#WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues pic.twitter.com/j5aolSZY7L
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
ఓవైపు సగం మంది పెవిలియన్ చేరినా అష్ గార్డ్నర్(63) మాత్రం దూకుడుగా ఆడుతూ..స్కోర్ దాటించింది. కిమ్ గార్త్(17)తో కలిసి సిక్సర్లతో చెలరేగిన తను స్కోర్ 300 దాటించింది. రాధా యాదవ్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన గార్డ్నర్ అదే ఓవర్లో రనౌట్ కాగా.. చివరి ఓవర్లో దీప్తి వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 338 పరుగుల వద్ద ఆలౌటయ్యింది.