అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో హాకీ మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. బ్లేక్ గోవర్స్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో ఆదివారం పోరులో ఆస్ట్రేలియా 7-4తో భారత్‌పై గెలిచింది. మూడో నిమిషంలోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ ద్వారా తొలి గోల్ నమోదు చేసినా గోవర్, జాక్ వెల్చ్ గోల్స్‌తో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గోవర్ 12, 27, 53 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్ చేసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. వెల్చ్ 17, 24 నిమిషాలలో జాక్ వెట్టన్ 48, జాకబ్ ఆండర్సన్ 49 నిమిషంలో గోల్స్ చేసి ఆసీస్‌ను ఆధిక్యంలో నిలిపారు.