కరార(గోల్డ్‌కోస్ట్): ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20(AUSvIND)లో ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, తిలక్ వర్మ ఔటయ్యారు. గిల్ 46 రన్స్ స్కోరు చేసి ఔటయ్యాడు. ఎల్లిస్ బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. బార్ట్లెట్ బౌలింగ్‌లో కెప్టెన్ సూర్య కుమార్ ఔటయ్యాడు. అతను 10 బంతుల్లో 20 రన్స్ చేశాడు. సూర్య వరుస బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం ఇండియా 16.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. అబిషేక్ 28, దూబే 22 రన్స్ చేసి ఔటయ్యారు.
4TH T20I. WICKET! 16.1: N Tilak Varma 5(6) ct Josh Inglis b Adam Zampa, India 131/5 https://t.co/OYJNZ57GLX #TeamIndia #AUSvIND #4thT20I
— BCCI (@BCCI) November 6, 2025