WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(15), శుభ్‌మన్ గిల్(13) ఔటయ్యారు. స్కాట్ బోలాండ్ ఓవర్లో బంతిని వదిలేసిన గిల్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, 30 పరుగుల వద్ద టీమిండియా రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఛటేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(0) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 439 వెనకబడి ఉంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలిరోజు విఫలమైన భారత బౌలర్లు రెండో రోజు విజృంభించారు. పేసర్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 469 పరుగుల వద్ద ముగిసింది. సిరాజ్ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్(9) భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే చేతికి చిక్కాడు. దాంతో, ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సంచలన ఆటతో ఆసీస్ భారీ స్కోర్‌కు బాటలు వేశారు. చివర్లో అలెక్స్ క్యారీ (48) ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 450 దాటించాడు.