IND vs AFG : కరీబియన్ గడ్డపై తొలి మ్యాచ్‌లో భారత టాపార్డర్ తడబడింది. అఫ్గన్ స్పిన్నర్ల విజృంభణతో టీమిండియా స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. 62 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(24), రిషభ్ పంత్(20)లు పెవిలియన్ చేరారు. దాంతో, మిడిలార్డర్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్(9), శివం దూబే(10)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు.
వీళ్లు నాలుగో వికెట్‌కు 17 రన్స్ జోడించారు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన దూబే తన ఉద్దేశాన్ని చాటగా.. సూర్య తన టైమింగ్ కోసం చూస్తున్నాడు. 10 ఓవర్లకు భారత జట్టు స్కోర్.. 79/3.
Naveen drops Pant and India are steady at 47-1 after the powerplay #AFGvIND #T20WorldCup
👉 https://t.co/gf52x20kRh pic.twitter.com/FQXXo7hbN0
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2024
టాస్ గెలిచిన టీమిండియాకు ఆదిలోనే షాక్. కెప్టెన్ రోహిత్ శర్మ(8) స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడు. దాంతో, 11 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది. ఫజల్ హక్ ఫారూఖీ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి ఎల్బీగా బతికిపోయిన రోహిత్.. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయాడు. కానీ, బంతి 30 అడుగుల వలయంలోనే గాల్లోకి లేచింది. దాంతో, అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సులువైన క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పంత్ అండగా.. కోహ్లీ రెండో వికెట్‌కు 43 రన్స్ జోడించారు. అయితే.. రషీద్ సూపర్ బాల్‌తో పంత్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు.
Virat Kohli and Rohit Sharma are trading places at the top 🔁#T20WorldCup #INDvAFG pic.twitter.com/xo9dKjpx50
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2024