గౌహతి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు(INDvSA) చివరి రోజు తొలి సెషన్లో ఇండియాకు జలక్ తగిలింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది టీమిండియా. సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ తన బౌలింగ్‌తో ఇండియాకు షాక్ ఇచ్చాడు. నైట్‌వాచ్‌మ్యాన్ కుల్దీప్ యాదవ్ 5 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు బంతులకే మరో బ్యాటర్ ద్రువ్ జురెల్ ఔటయ్యాడు. 549 పరుగుల టార్గెట్‌తో బరిలోకి భారత్ తాజా సమాచారం ప్రకారం 31.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 58 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో సాయి సుదర్శన్ ఉన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఔటయ్యాడు. అతను 13 రన్స్ చేసి నిష్క్రమించాడు. కుల్దీప్ క్లీన్ బౌల్డ్ అవ్వగా, జురెల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంత్‌ను కూడా హార్మర్ ఔట్ చేశాడు. ఇప్పటికే అతనికి 4 వికెట్లు దక్కాయి.
2ND Test. WICKET! 31.2: Rishabh Pant 13(16) ct Aiden Markram b Simon Harmer, India 58/5 https://t.co/Wt62QebbHZ #TeamIndia #INDvSA #2ndTest @IDFCfirstbank
— BCCI (@BCCI) November 26, 2025
>