తిరువనంతపురం : ఈ ఏడాది పలు సిరీస్ విజయాలకు తోడు స్వదేశంలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు.. 2025ను విజయంతో ముగించాలని భావిస్తున్నది. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4 మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న ఉమెన్ ఇన్ బ్లూ.. ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.
మంగళవారం (డిసెంబర్ 30) తిరువనంతపురం వేదికగా ఇరుజట్ల మధ్య సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టీ20 జరుగనున్నది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా నాలుగో టీ20లో కాస్త ప్రతిఘటించిన లంకేయులు.. సిరీస్ క్లీన్‌స్వీప్‌ను అడ్డుకుని బోణీ చేస్తారా? అన్నది ఆసక్తికరం. రాత్రి 7 గంటల నుంచి మొదలుకాబోయే ఈ మ్యాచ్‌ను స్టార్ స్టోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో వీక్షించొచ్చు.